సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 17:06:25

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం .. కాస్త‌లేట‌యింటే తండ్రి, బిడ్డ నుజ్జునుజ్జు అయ్యేవాళ్లు! ‌

తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం .. కాస్త‌లేట‌యింటే తండ్రి, బిడ్డ నుజ్జునుజ్జు అయ్యేవాళ్లు! ‌

ప్ర‌మాదం ఏ వైపు నుంచి వ‌స్తుందో అస‌లు ప‌సిగ‌ట్ట‌లేరు. రోడ్డుమీద‌కు వ‌చ్చాక ప్ర‌తిక్ష‌ణం జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఏ మాత్రం వేమ‌ర‌పాటు పాటించినా ప్ర‌ణాలు పోయే ప్ర‌మాదం ఉంది. మ‌నం జాగ్ర‌త్త‌గా ఉంటే స‌రిపోదు ఎదుటివారు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలి క‌దా. అలా జాగ్ర‌త్త‌గా ఉండే ఈ తండ్రి త‌న బిడ్డ ప్రాణాలు కాపాడుకోగ‌లిగాడు.

ఇత‌ను రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న కారులో తన బిడ్డను కుర్చోబెడుతున్నాడు. ఇంతలో ఓ భారీ కంటైనర్ ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టి కారు మీదకు దూసుకొచ్చింది. అంతే క‌ళ్లు మూసి తెరిచేలోపే అక్క‌డ బీభ‌త్సం సృష్టించింది. ఈ ప్ర‌మాదాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన ఆ తండ్రి బిడ్డ‌ను  ప‌ట్టుకొని వెన‌క్కి ఎస్కేప్ అయ్యాడు. ఇలాంటి ప‌రిస్థితి ప‌గ‌వాడికి కూడా రాకూడ‌దు.logo