బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 08:22:46

జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

జూన్‌ 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్ర

ఈ సంవత్సరం (2020) అమర్‌నాథ్‌ యాత్రను కిందటేడాదికంటే రెండు రోజులు ఎక్కువగా మొత్తం 42 రోజులపాటు నిర్వహించనున్నట్టు శ్రీఅమర్‌నాథ్‌ దేవస్థాన బోర్డు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ బిపుల్‌ పాఠక్‌ ఇటీవల ప్రకటించారు. దీనిని వచ్చే జూన్‌ 23నుంచి మొదలుపెట్టి ఆగస్టు 3వ తేదీన ముగిస్తామని ఆయన తెలిపారు. హిందూ క్యాలెండర్‌ ప్రకారం శ్రావణ పూర్ణిమ (రక్షాబంధన్‌) నాడు యాత్ర ముగుస్తుంది. ఈ యాత్రకు వెళ్లాలనుకొనే వారు ఏప్రిల్‌ 1వ తేదీనుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. 13 ఏండ్ల లోపు పిల్లలను, 75 సంవత్సరాల పైబడిన వృద్ధులను ఈ యాత్రకు అనుమతించరు. భౌగోళికంగా అనేక కొండలు, లోయల మీదుగా, అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల నడుమ సాగే ఈ ప్రయాణానికి సిద్ధమయ్యేవారు కొద్ది నెలల ముందునుంచే భౌతికంగా నడక, వ్యాయామాలతో ఆరోగ్యవంతులుగా ఉండటం తప్పనిసరి అని బోర్డు ఈ సందర్భంగా సూచించింది.logo