సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 13:00:46

పాక్‌‌లో గురుద్వారాను కూల్చి మ‌సీదు నిర్మాణం.. ఖండించిన సీఎం అమ‌రీంద‌ర్

పాక్‌‌లో గురుద్వారాను కూల్చి మ‌సీదు నిర్మాణం.. ఖండించిన సీఎం అమ‌రీంద‌ర్

హైద‌రాబాద్:‌ లాహోర్ న‌గ‌రంలో ఉన్న ప్ర‌ఖ్యాత సిక్కు గురుద్వారాను మ‌సీదుగా మార్చాల‌నుకుంటున్న పాకిస్థాన్‌ ప్ర‌య‌త్నాల‌ను పంజాబ్ సీఎం అమ‌రీంద‌ర్ సింగ్ ఖండించారు.  1745లో శ్రీ షాహిద్ అస్తాన్ గురుద్వారా ప్ర‌దేశంలోనే భాయ్‌ త‌రుణ్ సింగ్ జీ అస్త‌మించార‌ని, ప‌విత్ర‌మైన ఆ గురుద్వారాను మ‌సీదుగా మార్చ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్న‌ట్లు సీఎం అమ‌రీంద‌ర్ త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపారు.  త‌మ నిర‌స‌న‌ను పాకిస్థాన్ ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల‌ని ఆయ‌న విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌కు కూడా ట్వీట్ చేశారు. సిక్కుల ప‌విత్ర స్థ‌లాల‌ను ర‌క్షించే విధంగా పాకిస్థాన్ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.  నౌలాకా బ‌జార్‌లో ఉన్న గురుద్వారాను మ‌సీదుగా మార్చాల‌ని పాక్ చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఖండిస్తూ భార‌త ప్ర‌భుత్వం సోమ‌వారం పాక్ హై క‌మిష‌న్ ముందు నిర‌స‌న వ్య‌క్తం చేసింది.  logo