శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 01:52:42

అమలా శంకర్‌ అస్తమయం

అమలా శంకర్‌ అస్తమయం

  • భారతీయ నాట్యానికి వన్నెతెచ్చిన నృత్యకారిణి 

కోల్‌కతా: ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి అమలా శంకర్‌ (101) శుక్రవారం మరణించారు. ప్రపంచ ప్రఖ్యాత భారతీయ నృత్యకారుడు ఉదయ్‌శంకర్‌ సతీమణి అమలాశంకర్‌. 1930లలో శాస్త్రీయ నృత్యం నేర్చుకున్న అమలాశంకర్‌, నాటి కట్టుబాట్లను చేధించి బహిరంగ ప్రదర్శనలు ఇచ్చారు. ఆమె ప్రస్తుత బంగ్లాదేశ్‌లో ఉన్న జెస్సోర్‌లో 1919లో జన్మించారు. 1931లో పారిస్‌లో 11 ఏండ్ల వయసులో ఉదయ్‌శంకర్‌ను మొదటిసారి కలిసిన ఆమె తదనంతరం ఆయన నాట్యబృందంలో సభ్యురాలయ్యారు. కొంతకాలానికి వారు వివాహం చేసుకున్నారు. అమలాశంకర్‌ మృతిపట్ల పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సంతాపం తెలిపారు. అమల మృతి నాట్య ప్రపంచానికి తీరని లోటని పేర్కొన్నారు.logo