సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 15:10:55

దేశం కోసం ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌ల‌కైనా సిద్ధం: రాజ్‌నాథ్‌

దేశం కోసం ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌ల‌కైనా సిద్ధం: రాజ్‌నాథ్‌

న్యూఢిల్లీ: దేశ ఐక్య‌త‌, సార్వ‌భౌమ‌త్వాన్ని కాపాడేందుకు ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌ల‌కైనా సిద్ధ‌మేన‌ని కేంద్ర ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. కార్గిల్‌ విజ‌యం మ‌న ఆత్మ‌గౌర‌వానికేగాక అన్యాయంపై మ‌న పోరాటానికి ప్ర‌తీక అని ఆయ‌న అన్నారు. కార్గిల్ దినోత్స‌వం సంద‌ర్భంగా రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 1999లో పాకిస్థాన్‌పై జ‌రిగిన కార్గిల్ యుద్ధంలో అమ‌రులైన భార‌తీయ జ‌వాన్ల త్యాగ్యాన్ని దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోద‌న్నారు.

భార‌త్ ఒక బాధ్య‌త గ‌ల దేశ‌మ‌ని, బ‌య‌ట ఒత్తిళ్ల‌కు త‌లొగ్గ‌బోద‌న్న దివంగ‌త మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి మాట‌ల‌ను రాజ్‌నాథ్ గుర్తుచేశారు. భార‌త్ త‌న ర‌క్ష‌ణ కోస‌మే యుద్ధం చేస్తుంది త‌ప్ప ఇత‌ర దేశాల భూభాగాన్ని ఆక్ర‌మించ‌డం కోసం కాద‌న్నారు. సైనికులు కుల, మ‌తాల‌కు అతీతంగా దేశం కోసం సేవ చేస్తార‌ని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. క‌రోనా నేప‌థ్యంలో స‌హాయం అందించేందుకు సుమారు 1,80,000 మంది మాజీ సైనికులు త‌మ ఆస‌క్తిని తెలియ‌జేశార‌ని ఆయ‌న చెప్పారు.logo