బుధవారం 03 జూన్ 2020
National - May 18, 2020 , 19:54:16

కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు బిచ్చగాడి ఆర్థిక సాయం

కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు బిచ్చగాడి ఆర్థిక సాయం

చెన్నై: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను తీవ్రంగా దెబ్బతీసింది. దీంతో దాదాపు అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. దేశంలోనూ అదే పరిస్థితి ఉన్నది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దాతలు విరాళాలు అందజేస్తున్నారు. బిలియనీర్‌ నుంచి బిచ్చగాడి వరకు అందరూ తమ స్థాయికి తగ్గట్లు ఆర్థిక సాయం చేస్తున్నారు. తాజాగా తమిళనాడుకు చెందిన పూల్‌పాండియన్‌ అనే ఒక బిచ్చగాడు తాను రూపాయి రూపాయి అడిగి కూడబెట్టిన సొమ్ములోంచి రూ.10 వేలు కరోనా రిలీఫ్‌ ఫండ్‌కు దానం చేశాడు. ఈ మేరకు నగదున మధురై జిల్లా కలెక్టర్‌ టీజీ వినయ్‌కి అందజేశారు. 


logo