శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 19:42:40

ఒకే జైల్లో 86 మందికి క‌రోనా పాజిటివ్

ఒకే జైల్లో 86 మందికి క‌రోనా పాజిటివ్

శ్రీన‌గ‌ర్ : జ‌మ్మూక‌శ్మీర్ లో క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. రోజురోజుకు అక్క‌డ పాజిటివ్ కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. ద‌క్షిణ క‌శ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లా జైల్లో మొత్తం 190 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో 86 మందికి క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. పాజిటివ్ నిర్ధార‌ణ అయిన వారి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని జైలు సూప‌రింటెండెంట్ సైరోజ్ అహ్మ‌ద్ భ‌ట్ తెలిపారు. 

జైలు మొత్తాన్ని అధికారులు శానిటైజ్ చేశారు. ఇత‌ర ఖైదీల‌కు క‌రోనా వైర‌స్ వ్యాప్తి చెంద‌కుండా జైలు అధికారులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. 

జ‌మ్మూక‌శ్మీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 12,156 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 222 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం పాజిటివ్ కేసుల్లో 5,488 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఈ మ‌హ‌మ్మారి నుంచి 6,446 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo