శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 15:59:45

అయోధ్యలో శంకుస్థాపనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ తిరస్కరణ

అయోధ్యలో శంకుస్థాపనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ తిరస్కరణ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయం నిర్మాణానికి జరుగనున్న శంకుస్థాపనకు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. అయోధ్యలో భూమి పూజ కోసం నిర్వాహకులు 300 మందికిపైగా ఆహ్వానించారని, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ ఒక సామాజక కార్యకర్త పిటిషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమం జరుగకుండా ఆదేశాలు జారీ చేయాలని అందులో పేర్కొన్నారు. శుక్రవారం విచారణ జరిపిన అలహాబాద్ హైకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న రామ మందిరం కోసం ఆగస్టు 5న ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని రామాలయ నిర్మాణ ట్రస్ట్ ఇటీవల పేర్కొంది. మరోవైపు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కొందరు కోర్టులను ఆశ్రయిస్తున్నారు.
logo