గూడ్స్ రైలును నడిపిన మహిళలు

న్యూఢిల్లీ: గూడ్స్ రైలును పూర్తిగా మహిళా సిబ్బంది నడిపారు. ఈ నెల 5న మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు పూర్తి మహిళా సిబ్బందితో తొలి గూడ్స్ రైలును నడిపినట్లు పశ్చిమ రైల్వే పేర్కొంది. వసై రోడ్ నుంచి వడోదర వరకు ప్రయాణించిన ఈ గూడ్స్ రైలును కుంకుమ్ డోంగ్రే, ఉడితా వర్మ, ఆకాన్షా రాయ్ అనే ముగ్గురు మహిళా బృందం నడిపినట్లు తెలిపింది. వీరిలో ఒకరు లోకో పైలట్, మరొకరు కో పైలట్ కాగా మరో మహిళా గార్డుగా ఉన్నట్లు వెల్లడించింది. ఏ ఉద్యోగం కూడా మహిళల పనితీరు, సామర్థ్యానికి మించినది కాదని, దీనికి వీరే ఒక స్పష్టమైన ఉదాహరణ అని కొనియాడింది. మరో మూస ధోరణిని పశ్చిమ రైల్వే బ్రేక్ చేసినట్లు శీర్షికగా పేర్కొంది.
కాగా, రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్విట్టర్ ద్వారా ఆ ముగ్గురు మహిళా సిబ్బందికి అభినందనలు తెలిపారు. మరోవైపు ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. గూడ్స్ రైలును పూర్తిగా మహిళా సిబ్బంది నడపటం పట్లు పలువురు నెటిజన్లు ప్రశంసలు గుప్పించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండితాజావార్తలు
- కరోనా టీకా తీసుకున్న ఆశా వర్కర్‌కు అస్వస్థత
- క్లినిక్ బయట ఫొటోలకు పోజులిచ్చిన కోహ్లి, అనుష్క
- మీర్జాపూర్ టీంకు నోటీసులు.. అమెజాన్ ప్రైమ్‌కు మరిన్ని కష్టాలు..!
- కోబ్రా ఫోర్స్‌లోకి మహిళల్ని తీసుకుంటున్నాం..
- శాండల్‌వుడ్ డ్రగ్ కేసు.. నటి రాగిణి ద్వివేదికి బెయిల్
- షార్ట్‌సర్య్కూట్‌తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!