మంగళవారం 19 జనవరి 2021
National - Jan 10, 2021 , 00:58:39

ఎయిరిండియా మహిళా శక్తి!

ఎయిరిండియా మహిళా శక్తి!

  • శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి నాన్‌స్టాప్‌గా బెంగళూరుకు..
  • పైలట్లందరూ మహిళలే

బెంగళూరు, జనవరి 9: భారత విమానయాన చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానున్నది. ప్రపంచానికి చెరో కొసన ఉన్న అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తొలి ఎయిరిండియా విమానాన్ని అందరూ మహిళా పైలట్లే నడపనున్నారు. ‘ప్రపంచంలో ఎయిరిండియా అత్యంత దూరం నడపనున్న తొలి వాణిజ్య విమానం ఇదే.  ‘ఎయిరిండియా మహిళా శక్తి ప్రపంచాన్ని చుట్టి రానుంద’ని విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ ట్విట్టర్‌లో ప్రశంసించారు. ఈ విమానాన్ని కెప్టెన్‌ జోయా అగర్వాల్‌, కెప్టెన్‌ పి.తన్మయ్‌, కెప్టెన్‌ ఆకాంక్ష సోనావరె, కెప్టెన్‌ శివానీ మన్హాస్‌ నడుపనున్నారు. 238 సీట్ల సామర్థ్యమున్న ఈ విమానం శాన్‌ఫ్రాన్సిస్కోలో స్థానిక కాలమానం ప్రకారం శనివారం ఉదయం 8.30 గంటలకు బయలు దేరుతుంది.