బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 12, 2020 , 20:00:41

మ‌న భూభాగం మ‌న ఆధీనంలోనే ఉంది: : ITBP DG

మ‌న భూభాగం మ‌న ఆధీనంలోనే ఉంది: : ITBP DG

న్యూఢిల్లీ: ల‌ఢ‌ఖ్ తూర్పు ప్రాంతం‌లోని గ‌ల్వాన్ లోయ‌లో భార‌త్‌-చైనా సైనికుల మ‌ధ్య త‌లెత్తిన ఘ‌ర్ష‌ణ‌ల‌పై ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), సరిహద్దు భద్రతా దళం (BSF) డైరెక్టర్ జనరల్ సుర్జీత్ సింగ్ దేశ్వాల్ స్పందించారు. భారతదేశానికి చెందిన యావత్ భూభాగం మ‌న ఆధీనంలోనే ఉన్న‌ద‌ని ఆయ‌న చెప్పారు. ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడిన సుర్జీత్ దేశ్వాల్‌.. గ‌ల్వాన్‌ ఉద్రిక్తతలతో తలెత్తిన పరిస్థితి క్రమంగా మెరుగవుతోందన్నారు. ఇరు దేశాల మ‌ధ్య మిలిటరీ స్థాయిలోనూ, దౌత్య, ద్వైపాక్షిక‌ స్థాయిలోనూ చర్చలు జరిగాయని సుర్జీత్ దేశ్వాల్‌ చెప్పారు. హక్కుభుక్తంగా మనకు చెందిన భూభాగాన్ని కాపాడుకునే సామర్థ్యం మన దేశానికి ఉందని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ‌న భాభాగాన్ని కాపాడుకుంటామని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు భార‌త్‌, చైనా దేశాల మ‌ధ్య‌ వివిధ స్థాయిల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో దేశ్వాల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

తాజావార్తలు


logo