బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 09:52:54

ప్ర‌తి విద్యార్థికి డిజిట‌ల్ డివైస్ ఇవ్వండి..

ప్ర‌తి విద్యార్థికి డిజిట‌ల్ డివైస్ ఇవ్వండి..

హైద‌రాబాద్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో నిరుద్యోగ స‌మ‌స్య అంశాన్ని రాజ్య‌స‌భ‌లో జీరో అవ‌ర్‌లో విప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ లేవ‌నెత్తారు. 13 నెల‌ల క్రితం క‌శ్మీర్ హోదాను త‌ప్పించ‌డంతో.. అక్క‌డ టూరిజం ప‌డిపోయింద‌న్నారు.  ఉద్యోగ అవ‌కాశాలు, ఆర్థిక వ్య‌వ‌హారాలు దెబ్బ‌తిన్నాయ‌న్నారు. క‌శ్మీర్‌లో సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల‌ను మ‌ళ్లీ ప్రారంభించాల‌ని ఆజాద్ తెలిపారు.  సెల్ఫ్ హెల్ప్ కింద సుమారు 15 వేల ఇంజినీర్లు ప‌నిచేసేవారు అని, నాలుగు రోజుల క్రితం ఆ గ్రూపుల‌ను ర‌ద్దు చేశార‌ని, ఆ స్కీమ్‌ను కేంద్రం మళ్లీ ప్రారంభించాల‌ని ఆజాద్ కోరారు. నేష‌న‌ల్ హోమియోప‌తి హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేయాల‌ని కాంగ్రెస్ ఎంపీ భ‌ట్టాచార్య సూచించారు.  హోమియోప‌తితో చాలా ఉప‌యోగాలు ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. 

ప్ర‌తి విద్యార్థికి బేసిక్ డిజిట‌ల్ ప‌రిక‌రం కావాల‌ని ఎన్సీపీ ఎంపీ వంద‌నా చవాన్ తెలిపారు.  ఆన్‌లైన్ విద్య వ‌ల్ల చాలా మంది విద్యార్థులు చ‌దువుల‌కు దూరం అవుతున్న‌ట్లు తెలిపారు. ఫోన్ లేని కార‌ణంగా మ‌హారాష్ట్ర‌లో ప‌దవ త‌ర‌గ‌తి విద్యార్థి సూసైడ్ చేసుకున్న‌ట్లు చెప్పారు. దేశంలో 240 మిలియ‌న్ల విద్యార్థి జ‌నాభా ఉన్న‌దని, మ‌న యువ‌త‌ను మ‌నం కోల్పోలేమ‌ని ఎంపీ తెలిపారు. డిజిట‌ల్ డివైస్ లేని ప్ర‌తి విద్యార్థికి వాటిని అందించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఎంపీ వంద‌నా కోరారు. logo