గురువారం 21 జనవరి 2021
National - Dec 31, 2020 , 14:46:40

ఎల్లుండి నుంచి దేశ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై ర‌న్‌..

ఎల్లుండి నుంచి దేశ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై ర‌న్‌..

హైద‌రాబాద్‌:  దేశ‌వ్యాప్తంగా జ‌న‌వ‌రి రెండ‌వ తేదీ నుంచి వ్యాక్సిన్ డ్రై ర‌న్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.  కోవిడ్ టీకాల‌ను పంపిణీ చేసేందుకు ఈ డ్రైన్ ఏర్పాటు చేసిన‌ట్లు కొన్ని వ‌ర్గాల ద్వారా తెలుస్తోంది.  అన్ని రాష్ట్రాల్లోనూ ఎంపిక చేసిన ప్ర‌దేశాల్లో ఈ డ్రై ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు.  త్వ‌ర‌లోనే కోవిడ్ టీకా పంపిణీ ప్ర‌క్రియ చేప‌ట్టనున్న‌ట్లు ఇవాళ ప్ర‌ధాని మోదీ వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డ్రై ర‌న్ చోటుచేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి.  మ‌రోవైపు కోవిడ్ టీకాకు భార‌త ప్ర‌భుత్వం ఆమోదం తెలిపే ఛాన్సు కూడా ఉన్న‌ది. దేశంలో వ్యాక్సినేష‌న్ కోసం డ్రై ర‌న్‌ను ఏర్పాటు చేయ‌డం ఇది రెండ‌వ సారి అవుతుంది.  ఈనెల 28, 29 తేదీల్లో నాలుగు రాష్ట్రాల్లో డ్రై ర‌న్ ఏర్పాటు చేసిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది.  

వ్యాక్సిన్ రోలౌట్‌..

వ్యాక్సినేష‌న్ ల‌క్ష్యాల‌ను అందుకునేందుకు అన్ని రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధంగా ఉండాల‌ని త‌న ఆదేశాల్లో కేంద్ర ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది.  టీకా పంపిణీ అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌న్ ఇవాళ ఉన్న‌త స్థాయి స‌మావేశం ఏర్పాటు చేశారు. ఆరోగ్య‌శాఖ ప్రిన్సిప‌ల్ కార్య‌ద‌ర్శులు కూడా ఈ స‌మావేశానికి వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా హాజ‌రు అయ్యారు.  జ‌న‌వ‌రి రెండ‌వ తేదీన అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు డ్రైన్ ర‌న్ నిర్వ‌హిస్తాయ‌ని, ఆయా రాష్ట్రాల రాజ‌ధానుల్లో క‌నీసం మూడు ప్రాంతాల్లో ఈ డ్రైన్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్రం పేర్కొన్న‌ది. కొన్ని రాష్ట్రాల్లో జిల్లా కేంద్రాల్లోనూ టీకా పంపిణీ చేయ‌నున్నారు. 

డమ్మీ వ్యాక్సిన్


డ్రై ర‌న్‌లో భాగంగా డమ్మీ క‌రోనా వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నారు.  పంపిణీ కార్య‌క్ర‌మంలో ఎదుర‌య్యే లోపాల‌ను అధిగ‌మించేందుకు ఈ ప్ర‌క్రియ తోడ్ప‌డ‌నున్న‌ది. రెండు రోజ‌ల పాటు జ‌రిగిన మాక్‌డ్రిల్‌లో టీకా పంపిణీకి ఇండియా సిద్ధంగా ఉన్న‌ట్లు తెలిసింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ కోసం అమ‌లులో ఉన్న విధానాల ప‌ట్ల నాలుగు రాష్ట్రాలు సంతృప్తిని వ్య‌క్తం చేశాయి. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కోవిడ్ టీకాను ఆవిష్క‌రించే అవ‌కాశం ఉన్న దృష్ట్యా.. దేశ‌వ్యాప్తంగా డ్రై ర‌న్ నిర్వ‌హించ‌నున్నారు. న్యూ ఇయ‌ర్ వేళ టీకా మ‌న‌కు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలు ఉన్న‌ట్లు డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ వీజీ సొమాని తెలిపారు.

83 కోట్ల సిరంజీలు


మ‌రో వైపు వ్యాక్సినేష‌న్ కోసం కేంద్ర ప్ర‌భుత్వం సుమారు 83 కోట్ల సిరంజీల‌కు ఆర్డ‌ర్ చేసింది. వీటితో పాటు అద‌నంగా మ‌రో 35 కోట్ల సిరంజీల కోసం బిడ్స్ దాఖ‌లు చేసింది. ఈ సిరంజీల‌ను కోవిడ్ వ్యాక్సినేష‌న్‌కు వాడ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం చెప్పింది. 

ఇవి కూడా చ‌ద‌వండి

న్యూఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్‌.. ఏ దేశంలో ఎలా జ‌రుపుకుంటారో తెలుసా?

జనవరి 1 నుంచి కొత్త మార్పులివే.. అవేంటో తెలుసా?!

2020లో మనకు దూరమైన ప్రముఖులు..

రివైండ్‌ 2020: ఊహకందని విషాదాలు.. మార్పులు!

రివైండ్‌ 2020: గంగవ్వ నుంచి కమలా హ్యారీస్‌ వరకు.. ఈ యేటి మేటి మ‌హిళ‌లు వీరే!

అంబానీని వెన‌క్కి నెట్టిన చైనా కుబేరుడు ఝాంగ్ షాన్షాన్‌

రైల్వే టికెట్ల బుకింగ్‌.. ఇక మరింత సులభం

శ్రీవారికి క‌రోనా ఎఫెక్ట్‌.. ఈ ఏడాది ఆదాయం 500 కోట్లే

2020ని మ‌హేష్ స్టైల్‌లో ఫినిష్ చేసిన డేవిడ్ వార్న‌ర్

తాజావార్తలు


logo