ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 15:25:36

ఇక‌పై త‌మిళ‌నాడులో రాత్రి 10 గంట‌ల ‌వ‌ర‌కు దుకా‌ణాలు

ఇక‌పై త‌మిళ‌నాడులో రాత్రి 10 గంట‌ల ‌వ‌ర‌కు దుకా‌ణాలు

చెన్నై: త‌మిళ‌నాడులో దుక‌ణాలు, ఇత‌ర‌ వ్యాపార స‌ముదాయాల‌ను రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నడుపుకునేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. ఈ మేర‌కు త‌మిళ‌నాడు స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ ఉత్త‌ర్వులు గురువారం (అక్టోబ‌ర్ 22) నుంచి అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించింది. కాగా, క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా మార్చి 23 నుంచి దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. అనంత‌రం కేంద్రం విడుత‌ల వారీగా లాక్‌డౌన్ స‌డ‌లించింది. ఇటీవ‌ల‌ అన్‌లాక్‌-5 మార్గ‌ద‌ర్శ‌కాల్లో భాగంగా అన్ని ర‌కాల వ్యాపార స‌ముదాయాల‌ను రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి ఇచ్చింది. 

అయితే, స‌డ‌లింపులను ఎప్ప‌టి నుంచి అమ‌ల్లోకి తీసుకురావాల‌నే అంశాన్ని మాత్రం రాష్ట్రాల‌కే వ‌దిలేసింది. ఈ క్ర‌మంలో రాష్ట్రంలో క‌రోనా కేసులు ఎక్కువ‌గా ఉండ‌టంతో త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు దుకాణాలు నిర్వ‌హించుకునేందుకు అవ‌కాశం ఇవ్వ‌లేదు. తాజాగా కేసుల సంఖ్య త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో.. గురువారం నుంచి దుకా‌ణాలు, ఇత‌ర వ్యాపార స‌ముదాయాల‌ను రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించుకోవ‌చ్చ‌ని బుధ‌వారం ప్ర‌క‌టించింది.    

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.