గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 17:47:53

శంకరాచార్యులు, స్వామి రామనరేషాచార్యను కూడా ఆహ్వానించాలి..

శంకరాచార్యులు, స్వామి రామనరేషాచార్యను కూడా ఆహ్వానించాలి..

న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణం శంకుస్థాపనకు అన్ని పీఠాల శంకరాచార్యులు, రామనంది మఠాధిపతి స్వామి రామనరేషాచార్యను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఆగస్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. సోమవారం మీడియాతో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ అయోధ్యలో రామాలయ నిర్మాణాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని చెప్పారు. అయితే దీని కోసం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌లో శంకరాచార్యులందరికీ కేంద్రం చోటు కల్పించలేదన్నారు. విశ్వహిందూ పరిషత్, బీజేపీ నేతలను మాత్రమే సభ్యులుగా చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో అయోధ్యలో రామాలయం శంకుస్థాపనకు అన్ని పీఠాల శంకరాచార్యులు, రామనంది మఠాధిపతి స్వామి రామనరేషాచార్యను ఆహ్వానించడంతోపాటు వారిని కూడా న్యాస్ సభ్యులుగా చేయాలని దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.

logo