ఆదివారం 12 జూలై 2020
National - Jun 23, 2020 , 16:25:11

జూలై 31 వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి

జూలై 31 వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడతాయి

  • వెస్ట్‌ బెంగాల్‌ విద్యాశాఖ మంత్రి పార్థ చటర్జీ

పశ్చిమ బెంగాల్‌ : రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండడంతో విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా పశ్ఛిమ బెంగాల్‌లో జూలై 31వరకు అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడే ఉంటాయని విద్యాశాఖ మంత్రి పార్ఠ చటర్జీ అన్నారు. మంగళవారం ఆయన ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. జూలై చివరి వరకు పరిస్థితిని బట్టి పాఠశాలలు తెరిచే తేదీని కేంద్రంతో సంప్రదింపులు జరిపి తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుండడంతో విద్యార్థులను పాఠశాలకు పంపితే కేసులు మరిన్ని పెరిగే అవకాశం ఉందన్నారు. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల వారికి వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో మొత్తం 13945 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. అందులో 8297 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 555 మంది కరోనాతో మృతి చెందగా.. 5093 మంది చికిత్స పొందుతున్నారు. 


logo