బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 02, 2020 , 01:01:50

ప్రతి శరణార్థికి పౌరసత్వం!

ప్రతి శరణార్థికి పౌరసత్వం!

కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ద్వారా దేశంలోని శరణార్థ్ధులందరికీ పౌరసత్వం ఇచ్చే వరకూ తమ ప్రభుత్వం విశ్రమించబోదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని షాహిద్‌ మినార్‌ గ్రౌండ్‌లో సీఏఏకు అనుకూలంగా ఆదివారం నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడారు. తృణమూల్‌ కాంగ్రెస్‌(టీఎంసీ)తో పాటు ప్రతిపక్షాలన్నీ సీఏఏపై తప్పుడు ప్రచారం చేస్తూ శరణార్థ్ధులను, మైనార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు హింసాత్మకం అయ్యేలా టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అల్లరిమూకల్ని రెచ్చగొట్టారన్నారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై టీఎంసీ ప్రతిదాడికి దిగింది. తమ రాష్ట్రం గురించి పక్కనబెట్టి.. ఢిల్లీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని హితవు పలికింది. మరోపైపు, అమిత్‌షా సభ జరిగిన షాహిద్‌ మినార్‌ గ్రౌండ్‌కు వెళుతూ కొందరు బీజేపీ కార్యకర్తలు ‘గోలీ మారో..’ నినాదాలు చేయడం కనిపించింది. 
logo