మంగళవారం 07 జూలై 2020
National - Jun 19, 2020 , 18:16:39

ప్రధాని మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష భేటీ

ప్రధాని మోదీ అధ్యక్షతన కొనసాగుతున్న అఖిలపక్ష భేటీ

ఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం ప్రారంభమై కొనసాగుతుంది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో 20 పార్టీల నేతలు పాల్గొన్నారు. భేటీ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. గాల్వన్‌ వ్యాలీ ఘటన, సరిహద్దులో పరిస్థితులపై భేటీలో నేతలు చర్చిస్తున్నారు. సమావేశం ప్రారంభానికి ముందు చైనా సరిహద్దులో అమరులైన జవాన్లకు నేతలు నివాళులర్పించారు. ఈ భేటీలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, జైశంకర్‌ పాల్గొన్నారు. 

logo