National
- Dec 01, 2020 , 01:36:45
కరోనాపై 4న అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ: కరోనా పరిస్థితిపై చర్చించేందుకు డిసెంబర్ 4న అఖిలపక్ష సమావేశానికి కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే ఆన్లైన్ భేటీలో లోక్సభ, రాజ్యసభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో ఆయన మాట్లాడనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే అఖిలపక్ష సమావేశాన్ని సమన్వయం చేస్తున్న పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆయా పార్టీలకు ఆహ్వానాలు పంపినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు కరోనా టీకా, దాని సామర్థ్యానికి సంబంధించిన సమాచారాన్ని ప్రజలందరికీ అర్థమయ్యే సులువైన భాషలో ఇవ్వాలని ఫార్మా సంస్థలకు ప్రధాని మోదీ సూచించారు. వ్యాక్సిన్లు అభివృద్ధి చేస్తున్న పుణెలోని జెనోవా బయోఫార్మా, హైదరాబాద్లోని బయోలాజికల్ ఈ, డాక్టర్ రెడ్డీస్ సంస్థల ప్రతినిధి బృందాలతో సోమవారం ఆన్లైన్లో మాట్లాడారు.
తాజావార్తలు
- పురావస్తు తవ్వకాల్లో బయటపడ్డ మొఘల్ ‘వాటర్ ట్యాంక్’
- కపోతం చిహ్నంతో లేడీ గగా శాంతి సందేశం
- పది లక్షల మంది కరోనా టీకా వేయించుకున్నారు: కేంద్రం
- చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి నిధులు విడుదల
- ఎస్ఎస్వై అడిషనల్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ అరెస్ట్
- టేకు విత్తనాలు చల్లుతున్నపద్మశ్రీ అవార్డు గ్రహీత...!
- మహారాష్ట్రలో 20 లక్షలు దాటిన కరోనా కేసులు
- నిషేధిత గుట్కా, పొగాకు ఉత్పత్తుల పట్టివేత
- సినిమా టికెట్ ధరల పరిస్థితి ఏంటి..తగ్గిస్తారా, కొనసాగిస్తారా..?
- కేంద్ర ప్రతిపాదనపై రైతుల విముఖత
MOST READ
TRENDING