గురువారం 09 జూలై 2020
National - Jun 15, 2020 , 14:51:38

కరోనాపై అఖిలపక్ష సమావేశం

కరోనాపై అఖిలపక్ష సమావేశం

న్యూఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతమవుతుండడంతో పరిస్థితిపై చర్చిందుకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా అధ్యక్షతన సోమవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌, ఢిల్లీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అనిల్‌కుమార్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీల సమావేశం నిర్వహించారు. అమిత్‌ షా మాట్లాడుతూ.. ఢిల్లీలోని కంటైన్‌మెంట్‌ జోన్లలో ప్రతి ఒక్కరికి కరోనా పరీక్ష చేసి వైరస్‌ వ్యాప్తిని అంచనా వేయాలన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా బారినపడితే వారికి రూ.10వేలు ఇవ్వాలని కోరింది. నాలుగో ఏడాది వైద్య విద్యార్థులను నాన్‌ పేమెంట్‌ రెసిడెంట్‌ వైద్యులుగా, నర్సింగ్‌, బీఫార్మసీ విద్యార్థులను తాత్కాలిక ఆరోగ్య సిబ్బందిగా ప్రభుత్వం వినియోగించుకోవాలని సూచించింది.  అంతకుముందు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ ఆదేశ్‌కుమార్‌ గుత్తా మాట్లాడుతూ.. ప్రైవేట్‌ ల్యాబ్స్‌లో కరోనా పరీక్షల ధరలను తగ్గించాలని ప్రభుత్వానికి సలహా ఇచ్చామని, కోరానా రోగులకు చికిత్స అందించేందుకు క్లీనిక్‌లు, హాస్పిటళ్లను నేలకొల్పడంతోపాటు  తగ్గుతున్న మెడికల్‌ సిబ్బంది స్థానంలో ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ వలంటీర్ల సేవలను వినియోగించుకోవడంపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. 


logo