బుధవారం 03 జూన్ 2020
National - Mar 28, 2020 , 16:26:16

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నెల వేతనం విరాళం

బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల నెల వేతనం విరాళం

న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ తమ నెల వేతనాన్ని కేంద్ర సహాయ నిధికి విరాళంగా ఇవ్వనున్నట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధానికి, కోవిడ్‌-19పై కేంద్ర ప్రభుత్వ పోరాటానికి మద్దతుగా తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నట్లు జేపీ నడ్డా ప్రకటించారు. బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ. కోటి విరాళంగా అందజేయనున్నట్లు చెప్పారు. 


logo