శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 16:59:08

మాల్స్‌, థియేటర్లు, పబ్‌లు వారం పాటు బంద్‌

మాల్స్‌, థియేటర్లు, పబ్‌లు వారం పాటు బంద్‌

బెంగళూరు : కర్ణాటకలో కరోనా వైరస్‌తో 76 ఏళ్ల వృద్ధుడు మృతి చెందిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో కరోనా కట్టడికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. సీఎం యెడియూరప్ప అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి.. కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం యెడియూరప్ప మీడియాతో మాట్లాడారు. రేపట్నుంచి వారం రోజుల పాటు మాల్స్‌, విద్యాసంస్థలు, థియేటర్లు, నైట్‌ క్లబ్‌లు, పబ్‌లు, స్విమ్మింగ్‌ఫూల్స్‌ను మూసివేయనున్నట్లు సీఎం ప్రకటించారు. వివాహాలు, క్రీడా పోటీలు, సదస్సులు వాయిదా వేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా నడుస్తాయని సీఎం యెడియూరప్ప స్పష్టం చేశారు. కర్ణాటకలో కరోనా పాజిటివ్‌ కేసులు ఐదు నమోదు అయ్యాయి. ఈ ఐదుగురిలో గూగుల్‌ ఉద్యోగి కూడా ఉన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా 4,500 మంది కరోనా వైరస్‌తో చనిపోయారు. లక్షలాది మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. 


logo