బుధవారం 28 అక్టోబర్ 2020
National - Sep 28, 2020 , 15:15:16

అక్టోబర్‌ 5 వరకు స్కూళ్లు మూసివేత

అక్టోబర్‌ 5 వరకు స్కూళ్లు మూసివేత

న్యూఢిల్లీ : రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వ్యాప్తి కేసులను దృష్టిలో ఉంచుకుని అన్ని పాఠశాలలను వచ్చే నెల 5వ తేదీ వరకు మూసివేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (డీఈవో) జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు అన్నీ మూసివేస్తారు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఢిల్లీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అక్టోబర్ 5 వరకు ఆన్‌లైన్ అభ్యాసం, అభ్యాస కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. 

ఢిల్లీలో కరోనా ఇన్ఫెక్షన్ కేసు వెలువడిన తరువాత మార్చి 16 నుంచి అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేసారు. అనంతరం మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి నుంచి విద్యార్థులు ఇండ్లకే పరిమితమయ్యారు. పిల్లలు తమ విద్యను కోల్పోకుండా చూడటానికి ఆన్‌లైన్ ద్వారా విద్యను అందిస్తున్నారు. తొలుత సెప్టెంబర్ 30 లోపు రాజధానిలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కొన్ని షరతులతో సెప్టెంబర్ 21 నుంచి పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించవచ్చనే ఊహాగానాలు వెలువడ్డాయి.  అసోసియేషన్ ఆఫ్ అన్‌సీన్ సీబీఎస్‌ఈ మధ్యప్రదేశ్‌ ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని తమ సంస్థకు అనుబంధంగా ఉన్న సీబీఎస్‌ఈ పాఠశాలలను సెప్టెంబర్ 21 నుంచి విద్యార్థులను మార్గదర్శకత్వం కోసం పాఠశాలకు పిలవాలని నిర్ణయించాయి. చాలా పాఠశాలల్లోని తరగతి గదులను శుభ్రపరిచారు. విద్యార్థులు పాఠశాలకు వచ్చిన తరువాత వారికి ఎలాంటి సమస్య రాకుండా ఉండేంట్లుగా టైమ్‌టేబుల్ తయారు చేశారు. స్కూల్ బస్సులు ప్రస్తుతానికి నడపవు. విద్యార్థులు తల్లిదండ్రుల సమ్మతి తీసుకుని పాఠశాలకు రావాల్సి  ఉంటుంది.

ఢిల్లీలో వేగంగా పెరిగిన వ్యాప్తి

ఢిల్లీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 2 లక్షల 34 వేల 701 కేసులు నమోదయ్యాయి. ఇందులో లక్ష 98 వేల 103 మంది రోగులు నయమయ్యారు. రోగుల రికవరీ రేటు 84.40 శాతంగా ఉండగా.. మృతుల సంఖ్య 4,877 గా ఉన్నది.


logo