బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 15, 2020 , 15:26:01

తమిళనాడు, అసోంలో విద్యాసంస్థలు, సినిమాహాల్స్‌ బంద్‌

తమిళనాడు, అసోంలో విద్యాసంస్థలు, సినిమాహాల్స్‌ బంద్‌

హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అసోం వ్యాప్తంగా అన్ని స్కూల్స్‌, కాలేజీలు, యూనివర్సిటీలు, జిమ్స్‌, స్విమ్మింగ్‌ఫూల్స్‌, సినిమా హాల్స్‌ను మూసివేస్తున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ కృష్ణ తెలిపారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయన్నారు. రాష్ట్ర, సీబీఎస్‌ఈ బోర్డుకు చెందిన పరీక్షలు మినహా అన్ని రకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 5వ తరగతి వరకు అన్ని పాఠశాలలకు ఈ నెల 31వ తేదీ వరకు సెలవులను ప్రకటించింది.


logo