ఆదివారం 29 మార్చి 2020
National - Mar 13, 2020 , 13:39:15

యూపీలో మార్చి 22 వరకు విద్యాసంస్థలకు సెలవు

యూపీలో మార్చి 22 వరకు విద్యాసంస్థలకు సెలవు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో 11 మందికి కరోనా వైరస్‌ పాజిటివ్‌ వచ్చిందని ఆ రాష్ట్ర సీఎం ఆదిత్యనాథ్‌ తెలిపారు. ఆగ్రాలో ఏడుగురికి, ఘజియాబాద్‌లో ఇద్దరికి, నోయిడా, లక్నోలో ఒక్కొక్కరికి కరోనా వ్యాధి సోకినట్లుగా చెప్పారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌, కాలేజీలు, టెక్నికల్‌, వొకేషనల్‌ విద్యాసంస్థలకు ఈ నెల 22 వరకు సెలవులను ప్రకటిస్తున్నట్లు తెలిపారు. మార్చి 22 తర్వాత పరిస్థితిని సమీక్షించి నిర్ణయం ప్రకటించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలు కొనసాగుతాయని.. ఇంకా ప్రారంభం కానీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.


logo