మంగళవారం 07 జూలై 2020
National - Jun 01, 2020 , 19:27:30

చ‌ర్చ‌ల‌కు అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయ్‌: చైనా

చ‌ర్చ‌ల‌కు అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయ్‌: చైనా

న్యూఢిల్లీ: భార‌త్-చైనా స‌రిహ‌ద్దుల్లో ప్ర‌స్తుతం అంతా స‌జావుగానే ఉంద‌ని, ఉద్రిక్త‌త‌లు స‌ద్దుమ‌ణిగాయ‌ని చైనా విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి జావో లిజియాన్ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న స‌రిహ‌ద్దు స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించ‌డానికి అన్ని ద్వారాలు తెరిచే ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దౌత్య‌ప‌రంగా, మిలిట‌రీ అధికారుల స‌మావేశంతో ఇరుదేశాలు స‌మస్య‌ను ప‌రిష్క‌రించుకోవ‌చ్చ‌ని లిజియాన్ అభిప్రాయ‌ప‌డ్డారు. ‌రెండు దేశాలు స‌మావేశ‌మై చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకుంటాయన్న న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌ని జావో లిజియాన్ పేర్కొన్నారు.  ‌         


logo