శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 15:23:40

అయోధ్య‌కు అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఆహ్వానం: స‌్వామి గోవింద్‌దేవ్‌

అయోధ్య‌కు అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఆహ్వానం: స‌్వామి గోవింద్‌దేవ్‌

హైద‌రాబాద్‌: అయోధ్య‌లో రామాల‌య నిర్మాణం కోసం ప్ర‌ధాని మోదీ శంకుస్థాప‌న చేయ‌నున్న‌ట్లు శ్రీ రామ జ‌న్మ‌భూమి తీర్థ‌క్షేత్ర కోశాధికారి స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. కార్య‌క్ర‌మం స‌మ‌యంలో సోష‌ల్ డిస్టాన్స్ పాటించాల‌న్న ఉద్దేశంతో కేవ‌లం 150 మంది అతిథుల‌కు మాత్రమే ఆహ్వానం ప‌లికిన‌ట్లు ఆయ‌న చెప్పారు. శంకుస్థాప‌న స‌మ‌యంలో సుమారు 200 మంది అక్క‌డ ఉంటార‌ని స్వామి గోవింద్ దేవ్ తెలిపారు. శంకుస్థాప‌న చేయ‌డానికి ముందు.. ప్ర‌ధాని మోదీ అక్క‌డే ఉన్న రామాల‌యంలో పూజ‌లు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. హ‌నుమాన్ గ‌ర్హి ఆల‌యంలోనూ ప్ర‌ధాని పూజ‌లు చేయ‌నున్నారు.  అయోధ్య రాముడి ఆల‌య శంకుస్థాప‌న కోసం అన్ని రాష్ట్రాల సీఎంల‌ను ఆహ్వానిస్తున్న‌ట్లు స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. 


logo