మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 26, 2020 , 18:19:32

ఎమ్మెల్యేలంతా వారం రోజుల‌పాటు ఐసొలేష‌న్‌

ఎమ్మెల్యేలంతా వారం రోజుల‌పాటు ఐసొలేష‌న్‌

పుదుచ్చేరి: పుదుచ్చేరి అసెంబ్లీ స‌మావేశాల్లో పాల్గొన్న ఒక ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలంతా వారం రోజుల‌పాటు ఐసొలేషన్‌లో ఉండాల‌ని సీఎం వీ నారాయ‌ణ స్వామి తెలిపారు. సోమ‌వారం అంద‌రికీ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తామ‌ని అసెంబ్లీ చివ‌రి రోజున ఆయ‌న చెప్పారు. కేంద్ర‌పాలిత ప్రాంత‌మైన పుద్దుచ్చేరిలో సోమ‌వారం నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిగాయి. కాగా, శుక్ర‌వారం ఒక ఎమ్మెల్యేకు క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది. దీంతో శ‌నివారం అసెంబ్లీ స‌మావేశాల‌ను ఆరుబ‌య‌ట నిర్వ‌హించారు. బ‌డ్జెట్‌పై చ‌ర్చ అనంత‌రం అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాయి. మ‌రోవైపు  క‌రోనా నేప‌థ్యంలో బ‌డ్జెట్ స‌మావేశాలను విజ‌య‌వంతంగా నిర్వ‌హించ‌డంపై స్పీక‌ర్ శివ‌కొలుందును లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ ప్ర‌శంసించారు. ఒక ఎమ్మెల్యేకు క‌రోనా సోకిన నేప‌థ్యంలో శ‌నివారం నాటి స‌మావేశాల‌ను ఆరుబ‌య‌ట నిర్వ‌హించిన తీరును ఆమె కొనియాడారు.logo