గౌహతి: కరోనా నేపథ్యంలో మూసివేసిన సినిమా థియేటర్లను తిరిగి తెరువాలని డిమాండ్ చేస్తూ అస్సాంలో నిరసన చేపట్టారు. ఆల్ అస్సాం సినిమా హాల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఈ మేరకు గౌహతిలో ఆదివారం నిరసన కార్యక్రమం తలపెట్టింది. ప్రజా రవాణా, రెస్టారెంట్లు, బార్లు, షాపింగ్ మాల్లను తిరిగి తెరిచారని, సినిమా హాళ్లను తిరిగి తెరువడానికి ప్రభుత్వం ఎందుకు సిద్ధంగా లేదు అని నిరసకారుడు ధృవ్ ప్రశ్నించారు. కొన్ని నెలలుగా థియేటర్లు మూతపడటంతో ఉపాధి లేక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్ల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆ సంఘం డిమాండ్ చేసింది.