గురువారం 29 అక్టోబర్ 2020
National - Sep 18, 2020 , 20:28:21

రేపటి నుండి షెడ్యూల్ ప్రకారం దుబాయ్‌కు విమాన సర్వీసులు

రేపటి నుండి షెడ్యూల్ ప్రకారం దుబాయ్‌కు విమాన సర్వీసులు

న్యూఢిల్లీ: దుబాయ్‌కు శనివారం నుంచి సాధారణ షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది. భారత్ నుంచి దుబాయ్‌కు విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. సెప్టెంబర్ 4‌న జైపూర్-దుబాయ్ విమానంలో ఒక ప్రయాణికుడికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రెండోసారి ఇలా జరిగిన నేపథ్యంలో అక్టోబర్ 2 వరకు 15 రోజులపాటు దుబాయ్‌కు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు దుబాయ్ సివిల్ ఏవియేషన్ అథారిటీ ఇటీవల తెలిపింది. అయితే శనివారం నుంచి షెడ్యూల్ ప్రకారం అన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు నడుస్తాయని ఎయిర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వెల్లడించింది. కరోనా మార్గదర్శకాలను పక్కగా పాటిస్తామని చెప్పింది.

కరోనా నేపథ్యంలో మార్చి 25 నుంచి నిలిపివేసిన అంతర్జాతీయ విమాన సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. అయితే విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను దేశానికి తరలించేందుకు, దేశంలోని విదేశీయులను ఇతర దేశాలకు తరలించేందుకు వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక విమాన సర్వీసులను కేంద్రం నడుపుతున్నది. అలాగే కొన్ని దేశాలు కూడా భారత్‌కు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo