e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News రేప‌టి నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీగా క‌రోనా వ్యాక్సిన్‌

రేప‌టి నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీగా క‌రోనా వ్యాక్సిన్‌

రేప‌టి నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీగా క‌రోనా వ్యాక్సిన్‌

న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన కొత్త క‌రోనా వ్యాక్సిన్ పాల‌సీ సోమ‌వారం (జూన్ 21) నుంచి అమ‌ల్లోకి రానుంది. ఇందులో భాగంగా దేశంలో 18 ఏళ్లు నిండిన అంద‌రికీ కేంద్ర ప్ర‌భుత్వ‌మే ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్లు వేయ‌నుంది. ఈ నెల 8న ప్ర‌ధాని మోదీ దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. 75 శాతం వ్యాక్సిన్ల‌ను త‌యారీదారుల నుంచి కొని అంద‌రికీ ఫ్రీగా ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఇక నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వ‌మూ వ్యాక్సిన్ల కోసం ఖ‌ర్చు పెట్టాల్సిన అవ‌సంర లేదు. ఇప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం 45 ఏళ్లు పైబ‌డిన వారికి మాత్రమే కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చేది.

18 నుంచి 44 ఏళ్ల మ‌ధ్య వారు వ్యాక్సిన్‌కు డ‌బ్బు చెల్లించాల్సిందేన‌ని చెప్ప‌గా.. తెలంగాణ స‌హా కొన్ని రాష్ట్ర ప్ర‌భుత్వాల ఆ ఖ‌ర్చు తాము భ‌రిస్తామ‌ని ప్ర‌క‌టించాయి. ఈ వ్యాక్సిన్ విధానంపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతోపాటు సుప్రీంకోర్టు కూడా ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతో మోదీ స‌ర్కార్ దిగి వ‌చ్చి అంద‌రికీ ఫ్రీ వ్యాక్సిన్ ప్ర‌క‌ట‌న చేసింది. తాజా వ్యాక్సిన్ విధానం ప్ర‌కారం 75 శాతం వ్యాక్సిన్ల‌ను కేంద్ర‌మే కొనుగోలు చేసి రాష్ట్రాల‌కు పంపిణీ చేయ‌నుండ‌గా.. మిగిలిన 25 శాతం వ్యాక్సిన్లు మాత్రం ప్రైవేటు వారికి అమ్ముకునే అవ‌కాశం త‌యారీదారుల‌కు క‌ల్పించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రేప‌టి నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీగా క‌రోనా వ్యాక్సిన్‌
రేప‌టి నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీగా క‌రోనా వ్యాక్సిన్‌
రేప‌టి నుంచి 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఫ్రీగా క‌రోనా వ్యాక్సిన్‌

ట్రెండింగ్‌

Advertisement