శనివారం 30 మే 2020
National - Mar 29, 2020 , 22:47:17

క‌రోనాపై పోరులో అలీబాబా ఫౌండేష‌న్ చేయూత‌

క‌రోనాపై పోరులో అలీబాబా ఫౌండేష‌న్ చేయూత‌

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారిపై పోరులో భార‌త్‌కు సాయం చేయ‌డానికి జాక్ మా, అలీబాబా ఫౌండేష‌న్‌లు ముందుకొచ్చాయి. క‌రోనా క‌ట్ట‌డికి అత్య‌వ‌స‌ర‌మైన మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్‌, పేస్ మాస్కులు, క‌రోనా టెస్ట్ కిట్‌లు, ప్రొటెక్టివ్ క్లోత్స్‌, ఫోర్‌హెడ్ థ‌ర్మోమీట‌ర్లు, వెంటిలేట‌ర్ల‌ను ఈ రెండు ఫౌండేష‌న్లు స‌మ‌కూర్చ‌నున్నాయి. భార‌త్‌తోపాటు మ‌రో ఆరు దేశాల‌కు అంటే భూటాన్‌, అజ‌ర్‌బైజాన్‌, క‌జ‌కిస్థాన్‌, కిర్గిజిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, వియ‌త్నాంల‌కు జాక్‌మా, అలీబాబా ఫౌండేష‌న్‌లు చేయూత‌నందించ‌నున్నాయి. 

మొత్తం ఏడు దేశాల‌కు 17 ల‌క్ష‌ల మాస్క్‌లు, 1.65 ల‌క్ష‌ల టెస్ట్ కిట్‌ల‌తో పాటు ఇత‌ర అన్ని ర‌కాల మెడిక‌ల్‌ ఎక్విప్‌మెంట్స్‌ను సాధ్య‌మైనంత త్వ‌ర‌గా అందిస్తామ‌ని అలీబాబా ఫౌండేష‌న్ వెల్లడించింది. కాగా, ఇప్ప‌టికే జాక్‌మా, అలీబాబా ఫౌండేష‌న్ భార‌త్‌కు పంపించిన మెడిక‌ల్ ఎక్విప్‌మెంట్స్ శ‌నివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నాయి. భార‌త రెడ్ క్రాస్ సొసైటీ వీటిని పంపిణీ చేయ‌డానికి స‌హ‌క‌రించ‌నుంది. మిగతా ఎక్విప్‌మెంట్ మ‌రికొన్ని రోజుల్లో భార‌త్‌కు చేరుకోనుంది. 

అలీబాబా గ్రూప్‌కు చైనాకు చెందిన బిలియ‌నీర్ జాక్‌మా స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు. కాగా, జాక్ మా, అలీబాబా ఫౌండేష‌న్లు కేవ‌లం పైన పేర్కొన్న ఏడు దేశాల‌కే చేయూత‌నివ్వ‌డం లేదు. మొత్తం 23 ఆసియా దేశాల‌కు సాయం అందిస్తున్నాయి. ఈ 23 దేశాల‌కు క‌లిపి మొత్తం 74 ల‌క్ష‌ల మాస్కులు, 4.85 ల‌క్ష‌ల టెస్ట్ కిట్‌లు, ల‌క్ష ప్రొటెక్టివ్ దుస్తుల‌ను అందించ‌నున్నాయి.    


 


logo