శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
National - Aug 03, 2020 , 19:38:13

ముంబై పోలీసుల నిర్లక్ష్యంపై.. సుశాంత్‌ తండ్రి వీడియో సందేశం

ముంబై పోలీసుల నిర్లక్ష్యంపై.. సుశాంత్‌ తండ్రి వీడియో సందేశం

పాట్నా: బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తండ్రి కేకే సింగ్‌ సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తన కుమారుడు ప్రమాదంలో ఉన్నట్లు ఫిబ్రవరి 25న ముంబై పోలీసులను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అయినా వారు పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. జూన్‌ 14న సుశాంత్‌ చనిపోయాడని, నాడు తాను ఫిర్యాదు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మరోసారి ముంబై పోలీసులను కోరానని కేకే సింగ్‌ తెలిపారు. అయితే 40 రోజులైనా ముంబై పోలీసులు ఎలాంటి చర్య తీసుకోకపోవడంతోనే చివరకు పాట్నాలో ఫిర్యాదు చేసినట్లు ఆయన చెప్పారు. 

మరోవైపు సుశాంత్‌ కుటుంబ సభ్యులు ఎవరిపై అనుమానం వ్యక్తం చేయలేదని ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరంబిర్ సింగ్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. జూన్‌ 16న వారి స్టేట్‌మెంట్‌ను సిటీ పోలీసులు రికార్డు చేశారని ఆయన చెప్పారు. కాగా, సుశాంత్‌తో సహజీవనం చేసినట్లు చెబుతున్న నటి రేఖా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులపై కేకే సింగ్‌ గత వారం పాట్నాపోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు విత్‌డ్రా చేశారని, సుశాంత్‌ ఆత్మహత్య చేసుకునేలా ఒతిడి తెచ్చారని అందులో ఆరోపించారు. దీంతో సుశాంత్‌ మరణంపై సమాంతర దర్యాప్తునకు నలుగురు పోలీ‌స్‌ అధికారులతో ప్రత్యేక బృందాన్ని పాట్నా డీజీపీ ఏర్పాటు చేశారు. logo