శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 27, 2020 , 13:39:22

లాక్‌డౌన్‌.. మద్యం లేక విలవిల.. ఒకరు ఆత్మహత్య

లాక్‌డౌన్‌.. మద్యం లేక విలవిల.. ఒకరు ఆత్మహత్య

తిరువనంతపురం : కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతోంది. ఇక అన్ని రాష్ర్టాల్లో మద్యం షాపులు, బార్లను మూసివేశారు. కేరళలో అయితే గత రెండు రోజుల నుంచి మద్యం షాపులు మూసివేయడంతో.. మందు బాబులు విలవిలలాడిపోతున్నారు. మద్యానికి బానిసైన వారి బాధలు వర్ణణాతీతం. త్రిశూర్‌ జిల్లాలోని తువనూర్‌కు చెందిన సనోజ్‌(35) ఆత్మహత్య చేసుకున్నాడు. నిత్యం మద్యం సేవించే సనోజ్‌కు గత రెండు రోజుల నుంచి మద్యం లేకపోయే సరికి తీవ్ర ఒత్తిడికి గురయ్యాడు. ఆ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేరళ వ్యాప్తంగా 10 మంది మందు బాబులు.. డీఅడిక్షన్‌ సెంటర్‌లో చేరారు. మందుబాబులకు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి.. వారిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మద్యం షాపులు మూసివేత కారణంగా.. ఇంటికే మద్యం సరఫరా చేసే విధంగా అనుమతివ్వాలని ఓ వ్యక్తి కేరళ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది. పనికిమాలిన పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడింది. పిటిషనర్‌కు కోర్టు రూ. 50 వేలు జరిమానా విధించింది. రెండు వారాల్లోగా రూ. 50 వేలు చెల్లించకపోతే.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.


logo