సోమవారం 25 మే 2020
National - Mar 29, 2020 , 00:39:04

అక్షయ్‌కుమార్‌ 25 కోట్ల విరాళం

అక్షయ్‌కుమార్‌ 25 కోట్ల  విరాళం

  • కరోనా నియంత్రణకు యాక్షన్‌కింగ్‌ భారీ ఆర్థిక సాయం
  • ప్రాణముంటేనే ప్రపంచముంటుంది
  • జీవితాన్ని కాపాడే యజ్ఞంలో భాగస్వాములవుదాం
  • భావోద్వేగ ట్వీట్‌ చేసిన సినీనటుడు

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఎప్పుడు ముందుంటారు. గతేడాది పుల్వామా దాడిలో అమరులైన జవాన్ల కుటుంబాలను ఆదుకోవడానికి రూ. కోటికి పైగా విరాళం ఇచ్చారు. 2017లో మార్చిలో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లో 12 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు చనిపోయారు.  ఆ జవాన్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 9 లక్షల చొప్పున మొత్తం 1.08 కోట్లను అందజేశారు. 2015లో చెన్నైలో సంభవించిన వరదల్లో నిరాశ్రయులైన వారికి సాయంగా అక్షయ్‌ కోటి రూపాయల్ని విరాళమిచ్చారు. అదే ఏడాది మహారాష్ట్రలో కరువు తలెత్తి ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 90 లక్షల్ని విరాళంగా ఇచ్చారు. లింగ మార్పిడి చేసుకున్న వారి కోసం రూ.1.5 కోట్లతో ఇటీవల అక్షయ్‌ గృహాల్ని నిర్మించి ఇచ్చారు.


logo