శుక్రవారం 04 డిసెంబర్ 2020
National - Aug 15, 2020 , 13:40:11

వరదబాధితుల సాయానికి ముందుకొచ్చిన అక్షయ్ కుమార్

వరదబాధితుల సాయానికి ముందుకొచ్చిన అక్షయ్ కుమార్

ముంబై : బిహార్, అసోం రాష్ట్రల్లో వరద బాధితులకు సహాయం చేయడానికి మరోసారి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ముందుకొచ్చారు. గత నాలుగు రోజులుగా కుర్తుస్తున్న భారీ వర్షాలకు బిహార్, అసోం రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తలమునకలై ఉన్నారు.

ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా హృదయం చాటుకున్నారు నటుడు అక్షయ్ కుమార్. రెండు రాష్ట్రల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పెద్ద సంఖ్లో ప్రజలు వరదల్లో చిక్కుకున్నట్లు వార్తల్లో తెలుసుకున్న ఆయన.. బిహార్, అసోం రాష్ట్రాల ముఖ్యమంత్రుల రిలీఫ్ పండ్ కు రూ.కోటి చొప్పున ఆర్థిక సాయం చేస్తానని ప్రమాణం చేశారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడిన అక్షయ్ కుమార్.. ఈ మేరకు తన సాయాన్ని ప్రకటించారు. అక్షయ్ కుమార్  ఔదార్యానికి ముఖ్యమంత్రులు ఇద్దరూ కృతజ్ఞతలు తెలిపి ఆయన చేస్తున్న సహాయాన్ని ప్రశంసించారు.

అంతకుముందు, కొవిడ్ -19 తో పోరాటం కోసం అక్షయ్ కుమార్ పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.25 కోట్లు అందించారు. ఇవే కాకుండా మాస్క్‌లు, పీపీఈ కిట్లు, రాపిడ్‌ ఫైర్‌ కిట్లు కొనుగోలు చేయడానికి బీఎంసీకి రూ.3 కోట్లు ఇచ్చారు. ముంబై పోలీస్ ఫౌండేషన్‌లో రూ.2 కోట్లు జమ చేశారు. అంతే కాకుండా, రోజువారీ కూలీలకు సహాయం చేయడానికి సినీ, టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (సింటా) కు రూ.45 లక్షలు అందించారు. పుల్వామాలో ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన 40 మంది సైనిక జవాన్ల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నెలకొల్పిన వీర్ ట్రస్ట్ కు రూ. 5 కోట్లు ఇచ్చి తన గొప్ప మనుసు చాటుకున్నారు.