హర్‌సిమ్రత్‌ రాజీనామా బాంబ్‌తో మోదీని షాక్‌ చేశాం..

Sep 25, 2020 , 17:33:19

అమృత్‌సర్‌: రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా అణు బాంబ్‌ వేసి జపాన్‌ను షాక్‌ చేస్తే.. హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ రాజీనామా బాంబుతో ప్రధాని మోదీని శిరోమణి అకాలీదళ్‌ షాక్‌ చేసిందని ఆ పార్టీ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్‌ బాదల్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాలు పిలుపునిచ్చిన బంద్‌ సందర్భంగా ముక్త్సర్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. గత రెండు నెలలుగా రైతుల గురించి ఒక్క మాట కూడా లేదని, ప్రస్తుతం ఐదారుగురు కేంద్ర మంత్రులు దీని గురించి మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం అమరీందర్‌ సింగ్‌ తక్షణం క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి కేంద్ర వ్యవసాయ బిల్లులను పంజాబ్‌లో అమలు చేయకుండా ఆర్డినెన్స్‌ తీసుకురావాలని సుఖ్‌బీర్ సింగ్‌ బాదల్ డిమాండ్‌ చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD