మంగళవారం 31 మార్చి 2020
National - Feb 28, 2020 , 15:30:06

అజిత్ దోవ‌ల్‌.. 1972లోనే హీరో

అజిత్ దోవ‌ల్‌.. 1972లోనే హీరో

హైద‌రాబాద్‌:  జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ గురించి ఇదో ఆస‌క్తిక‌ర క‌థ‌నం.  ఇండియ‌న్ జేమ్స్ బాండ్‌గా పేరుగాంచిన దోవ‌ల్‌.. ఇప్ప‌టి వ‌ర‌కు అనేక  కీల‌క ఆప‌రేష‌న్లు చేపట్టారు.  ఇటీవ‌ల క‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు త‌ర్వాత‌.. అక్క‌డ ప్రశాంతత నెలకొల్పేందుకు ఆయ‌న ప్ర‌త్యేకంగా రంగంలోకి దిగారు. తాజాగా ఢిల్లీలో చెల‌రేగుతున్న అల్ల‌ర్ల‌ను అదుపులోకి తెచ్చేందుకు కూడా దోవ‌ల్‌కు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు అప్ప‌గించారు. డోనాల్డ్ ట్రంప్ ఇండియా దాటి వెళ్లారో లేదో.. దోవ‌ల్ ఈశాన్య ఢిల్లీలో వీధివీధి తిరిగారు. హింస మ‌రింత పెర‌గ‌కుండా ఉండేందుకు అన్ని చ‌ర్య‌లు తీసుకున్నారు.  భార‌తీయ జ‌న‌తా పార్టీ తురుపుముక్క‌గా మారిన దోవ‌ల్..  1972లోనే ఓ అల్ల‌ర్ల కేసును చాలా ఈజీగా డీల్ చేశారు.  

1968 బ్యాచ్‌కు చెందిన కేర‌ళ ఐపీఎస్ ఆఫీస‌ర్ దోవ‌ల్‌.. 1972లో త‌ల్ల‌స‌రిలో జ‌రిగిన మ‌త‌ఘ‌ర్ష‌ణ‌లను అత్యంత స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రించారు. హిందువులు, ముస్లింల మ‌ధ్య 1971 చివ‌ర్లో ఘ‌ర్ష‌ణ‌లు మొద‌ల‌య్యాయి. ఆ అల్ల‌ర్లు 1972లోకి ప్ర‌వేశించాయి. ముస్లింల‌ను టార్గెట్ చేస్తున్న‌ట్లు అప్ప‌టికే ఆర్ఎస్ఎస్‌పై ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అయితే ముస్లింల‌తో చేతులు క‌లిపిన సీపీఐ.. భారీ అల్ల‌ర్ల‌కు ప్లాన్ వేసింది.  జ‌ర‌గ‌బోయే ఉప‌ద్ర‌వాన్ని అంచ‌నా వేసిన అప్ప‌టి ఆ రాష్ట్ర హోంమంత్రి క‌రుణాక‌ర‌న్‌.. ఆ అల్ల‌ర్ల‌ను అదుపు చేసే బాధ్య‌తల‌ను యువ దోవ‌ల్‌కు అప్ప‌గించారు. కొట్టాయంలో ఏఎస్పీగా ప‌నిచేస్తున్న దోవ‌ల్‌.. వెంట‌నే రంగంలోకి దిగి ఆ అల్ల‌ర్ల‌ను ఆపేశారు. బాధితుల‌కు హామీ ఇచ్చిన‌ట్లే, లూటీ చేసిన సొమ్మును వెన‌క్కి తీసుకువచ్చారు. కేర‌ళ‌లో కొన్నాళ్లు లా అండ్ ఆర్డ‌ర్ ఇంచార్జీగా ఉన్న దోవ‌ల్‌.. ఆ త‌ర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరోలో చేరారు. ఇక ఆ త‌ర్వాత భార‌త గూఢాచారిగా ఆయ‌న ఎన్నో స‌క్సెస్‌ఫుల్‌ ఆప‌రేష‌న్లు చేప‌ట్టారు. 


logo
>>>>>>