టోక్యో/లండన్: కరోనా వేళ ఝూమ్మంటూ జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తున్న క్రిప్టో కరెన్సీలపై వివిధ దేశాల పాలకుల కన్ను పడింది. ఇప్పటివరకు టర్కీ వంటి దేశాలు బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టడంపై నిషేధం విధించాయి.
తాజాగా బిట్ కాయిన్ తదితర క్రిప్టో కరెన్సీలపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించలేదు. కానీ.. వర్చువల్ కరెన్సీలో పెట్టిన పెట్టుబడులపై క్యాపిటల్ గెయిన్ టాక్సెస్ పెంచడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రణాళిక రూపొందిస్తున్నారన్న వార్తలు శుక్రవారం పొక్కాయి.
డిజిటల్ కరెన్సీల్లో పెట్టుబడుల ద్వారా 10 లక్షల డాలర్లు, అంతకంటే ఎక్కువ సంపాదిస్తే 39.6 శాతం క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విధించేందుకు అమెరికాలో ప్రణాళిక రూపుదిద్దుకుంటున్నది. ఇది ఇప్పటివరకు అమలులో ఉన్న పన్ను రేటు కంటే రెట్టింపు అవుతుంది. ఫలితంగా ఇన్వెస్టర్లలో నెగెటివ్ సెంటిమెంట్ బలపడింది.
అమెరికా టాక్స్ కోడ్ విధానంలో ప్రతిపాదిత మార్పుల గురించి వార్తలు రాగానే ఇన్వెస్టర్లు బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీల్లో వాటాలను విక్రయించేశారు. క్రిప్టో కరెన్సీల్లో పాపులర్, అతి పెద్దది బిట్ కాయిన్.
బిట్ కాయిన్ విలువ 48,867 డాలర్లకు పడిపోయింది. గత మార్చి తర్వాత బిట్ కాయిన్ విలువ 50 వేల డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే మొదటిసారి. మిగతా క్రిప్టో కరెన్సీలు ఈథర్, ఎక్స్ఆర్పీ సుమారు ఏడు శాతం పతనం అయ్యాయి.
జో బైడెన్ సర్కార్ టాక్స్ ప్లాన్లు మార్కెట్లను కుదిపేశాయి. స్టాక్స్, రిస్క్ అసెట్స్‌లో తమ వాటాలను విక్రయించి లాభాలు గడించారు. ఇక బిట్ కాయిన్ ఈ వారంలోనే 15 శాతం నష్టపోయింది. అయితే, ఈ ఏడాదిలో ఇప్పటివరకు 65 శాతం పైనే ఉంది.
బిట్ కాయిన్ రైవల్ ఈథర్ విలువ 10 శాతానికి పైగా పడిపోయింది. గురువారం ట్రేడింగ్‌లో రికార్డు స్థాయిలో 2,645.97 డాలర్ల స్థాయికి దూసుకెళ్లింది. కానీ శుక్రవారం ట్రేడింగ్‌లో 2,107 డాలర్లకు పతనమైంది.
ఆక్సిజన్ సరఫరా అడ్డుకున్న వాళ్లను ఉరితీస్తాం.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చరిత్రలో ఈరోజు
స్టీల్ ప్లాంట్ల నుంచి 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరాలు!
ఆక్సిజన్ కు కటకట : అలాగైతే 24 గంటల్లో వ్యవస్థ కుప్పకూలుతుంది..
ఆక్సిజన్ కొరత.. ఆ దవాఖానలో కొత్త రోగులకు నో అడ్మిషన్
మళ్లీ గరీబ్ కల్యాణ్ యోజన: రెండు నెలలు పేదవాడికి 5 కిలోల బియ్యం ఫ్రీ
ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకుల రుణాలు.. ఎందుకంటే?!
ఆక్సిజన్ సిలిండర్ల బ్లాక్ మార్కెంటింగ్ : నిందితుడు అరెస్ట్
మహేష్ ఖాతాలో మరో రికార్డ్.. మైండ్ బ్లాక్ చేసిన సూపర్ స్టార్
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు
ఒక్క మాస్క్ సరిపోదా? రెండు మాస్కులు కచ్చితంగా వాడాలా?
అత్యంత ఖరీదైన, అతిపెద్ద స్మార్ట్‌టీవీని ఆవిష్కరించిన షియోమీ
భారత్ భయంకరమైన స్థితిలో ఉన్నది: ఆంథోనీ ఫౌసీ
19 సిటీల్లో హెచ్డీఎప్సీ మొబైల్ ఏటీఎంలు..
Largest Divorce : విడాకులు తీసుకున్న తల్లి.. 750కోట్లు భరణం చెల్లించనున్న కొడుకు
పర్పుల్ కలర్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్ల బుకింగ్ ప్రారంభం