సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 01:26:05

ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్‌

ఐశ్వర్య, ఆరాధ్యలకు నెగెటివ్‌

ముంబై: బాలీవుడ్‌ కథా నాయిక ఐశ్వర్యా రాయ్‌ బచ్చన్‌, ఆమె కూతురు ఆరాధ్య బచ్చన్‌లకు సోమవారం నిర్వహించిన వైద్య పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. దీంతో వారిని ముంబైలోని నానావతి దవాఖాన నుంచి డిశ్చార్జి చేశారు. ఈ విషయాన్ని ఐశ్వర్య భర్త అభిషేక్‌ బచ్చన్‌ ట్విట్టర్‌లో ధ్రువీకరించారు. ‘తల్లీకూతుళ్లకు కరోనా నెగెటివ్‌ అని తేలింది. నేను, మా నాన్న అమితాబ్‌ బచ్చన్‌ ఇంకా దవాఖానలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాం. అభిమానులకు రుణపడి ఉంటాం’ అని అభిషేక్‌ ట్వీట్‌ చేశారు. 


logo