గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 17, 2020 , 13:19:28

10వేల కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌

10వేల కోట్లు చెల్లించిన ఎయిర్‌టెల్‌

హైద‌రాబాద్‌:  సుప్రీంకోర్టు ఆదేశాల మేర‌కు భార‌తి ఎయిర్‌టెల్ కంపెనీ.. ఇవాళ 10వేల కోట్ల ఏజీఆర్ బ‌కాయిల‌ను టెలికాంశాఖ‌కు చెల్లించింది.  టెలికాం డిపార్ట్‌మెంట్‌కు ఎయిర్‌టెల్ మొత్తం 35, 500 కోట్లు బ‌కాయి ఉన్న‌ది. స్పెక్ట్ర‌మ్ చార్జీలు, లైసెన్సు ఫీజుల కింద ఆ సంస్థ బకాయి ఉన్న‌ది.   భార‌తి ఎయిర్‌టెల్ లిమిటెడ్ త‌ర‌పున 9500 కోట్లు, భార‌తి హెక్సాకామ్ త‌ర‌పున 500 కోట్లు చెల్లించిన‌ట్లు భార‌తి ఎయిర్‌టెల్ ఇవాళ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.  టెలికాం సంస్థ‌లు బకాయీలు చెల్లించ‌డం లేదంటూ.. ఇటీవ‌ల సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. సుప్రీం సీరియ‌స్ కావ‌డంతో.. ఆ బ‌కాయీలు చెల్లించాలంటూ డీవోటీ అత్య‌వ‌స‌ర ఆదేశాలు జారీ చేసింది.  


logo
>>>>>>