శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 26, 2020 , 19:02:07

ఉచితంగా పుస్తకాలు చదువుకోండి- ఎయిర్‌టెల్ ఆఫ‌ర్‌

ఉచితంగా పుస్తకాలు చదువుకోండి- ఎయిర్‌టెల్ ఆఫ‌ర్‌

కేంద్రం ప్ర‌క‌టించిన క‌రోనా లాక్‌డౌన్‌కు మ‌ద్ద‌తుల‌గా ప్ర‌ముఖ టెలికం ఆప‌రేట‌ర్ భార‌తి ఎయిర్‌టెల్ ఉచితంగా పుస్త‌కాలు చ‌దువుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. ఈ-బుక్ ప్లాట్‌ఫాం జగ్గర్నాట్లో బుక్స్‌ను ఉచితంగా  చ‌దువుకోవ‌చ్చ‌ని బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో ఆ కంపెనీ తెలిపింది. COVID-19 వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతుగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు కంపెనీ తెలిపింది. భారతదేశంలోని ప్ర‌జ‌లు అంద‌రూ ఇంట్లోనే ఉన్నందున పాఠకులు ఇప్పుడు యాప్ (ఆండ్రాయిడ్ / iOS) ను స్మార్ట్‌ఫోన్‌లలో  డౌన్‌లోడ్ చేసుకుని ప్ర‌ముఖ ర‌చ‌యిత‌ల పుస్త‌కాలు, జ‌ర్న‌ల్స్ ను ఉచితంగా చ‌దువుకోవ‌చ్చ‌ని భారతి ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఎయిర్‌టెల్ 2017 లో జగ్గర్‌నాట్‌లో వ్యూహాత్మక వాటాను సొంతం చేసుకున్న విష‌యం విదిత‌మే.

జగ్గర్నాట్ పుస్త‌కాలు చ‌ద‌వ‌డాన్ని ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా వినూత్నంగా ఆన్‌లైన్ సాహిత్య ఉత్సవాన్ని కూడా నిర్వహిస్తోంది. ఈ అపూర్వమైన కాలంలో చదవడానికి మించిన‌ది ఏదీ లేదు అని భారతి ఎయిర్టెల్ చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ ఆదర్శ్ నాయర్ అన్నారు.logo