సూపర్ ఆఫర్ : ఎయిర్ టెల్ ఫ్రీ డేటా...!

ఢిల్లీ: టెలికం దిగ్గజం ఎయిర్టెల్ సూపర్ ఆఫర్ ను ప్రవేశపెట్టింది. 11GB డేటాను ఫ్రీ గా అందుకోవచ్చు. ఎయిర్టెల్ కొత్త 4G కస్టమర్లకు లేదా 4Gకి అప్ గ్రేడ్ అయ్యే వినియోగదారులకు డేటాను ఉచితంగా ఇవ్వనున్నది. అయితే ఇది రెండు రకాలుగా వినియోగదారులకు అందనుంది. ఈ ఆఫర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసిన తర్వాత దీనిని పొందవచ్చు. ఎయిర్టెల్ అందించే 11GB డేటా రెండు విడతల్లో పొందవచ్చు. కొత్తగా ఎయిర్టెల్ 4G కస్టమర్ ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే 5GB డేటా వస్తుంది.
ఈ డేటా మొత్తం ఐదు 1GB కూపన్ల రూపంలో మూడు రోజుల వ్యవధిలో యాప్ ద్వారా క్రెడిట్ అవుతుంది. కొత్త మొబైల్ నెంబర్ యాక్టివేట్ అయ్యాక నెల రోజుల్లో ఎయిర్ టెల్ థ్యాంక్స్ యాప్‌లో రిజిస్టర్ కావాలి. ఐదు కూపన్లు వస్తే యాప్‌లోని మై కూపన్స్ సెక్షన్‌కు వెళ్లి వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ 1GB డేటా కూపన్‌ను యాప్‌లో క్రెడిట్ అయిన 90 రోజుల్లోగా రిడీమ్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ డౌన్ లోడ్ చేసుకోకుంటే 5GB డేటాకు బదులు 2GB డేటా వస్తుంది. ఇక ఎయిర్టెల్ కూడా తన అన్లిమిటెడ్ ప్యాకేజీ తీసుకునే కస్టమర్లకు దాదాపు 6GB డేటా వరకు ఉచితంగా ఇస్తుంది.
84 రోజుల కాలపరిమితితో రూ.598 అంతకంటే ఎక్కువ మొత్తం ప్యాకేజీని ఎంచుకుంటే కస్టమర్లకు 6GB డేటా ఉచితం. ఈ డేటా మొత్తం ఒకేసారి రాదు. 6GB ఉచిత డేటా కూపన్ల రూపంలో వస్తుంది. రూ.399 అంతకంటే ఎక్కువ ప్లాన్స్ తీసుకుంటే నాలుగు కూపన్లు, రూ.219 ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకుంటే 2 కూపన్లు వస్తాయి. ఎయిర్టెల్ థ్యాంక్స్ యాప్ ద్వారా రీఛార్జ్ చేయాలి. కొత్త 4G ఎయిర్టెల్ కస్టమర్ రూ.598 ప్రీపెయిడ్ ప్యాకేజీ తీసుకుంటే 11GB డేటా పొందే అవకాశం ఉన్నది.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- రామునిపట్ల వద్ద రెండు బైక్‌లు ఢీ: ఇద్దరు మృతి
- రూపేశ్‌ను హతమార్చింది కిరాయి హంతకులే: బీహార్ డీజీపీ
- సీఎం కేసీఆర్ చెబితే చట్టం చేసినట్టే : మంత్రి తలసాని
- వాటాల ఉపసంహరణే దిక్కు: రాజన్
- శ్రీశైలంలో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
- టీకా వేయించుకున్న 51 మందికి స్వల్ప అస్వస్థత
- త్రిభంగా మూవీ రివ్యూ: అలాంటి వాళ్ల కోసమే చిత్రం అంకితం
- ముఖేశ్ ‘రిలయన్స్’కే శఠగోపం..6.8 కోట్ల చీటింగ్
- బర్త్ డే రోజు వివాదం.. క్షమించమని కోరిన విజయ్ సేతుపతి..
- తలపై రూ.8 లక్షల రివార్డు ఉన్న మావోయిస్టు మృతి