గురువారం 26 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 13:13:40

క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఎయిర్‌టెల్

క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్‌లోకి ప్రవేశించిన ఎయిర్‌టెల్

ఢిల్లీ : ప్రముఖ టెలీ కమ్యూనికేష న్స్ సంస్థ భారతీ ఎయిర్‌టెల్ మరో అడుగు ముందుకేసింది. క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్లోకి ప్రవేశించింది. "ఎయిర్ ఐక్యూ "పేరు తో ఓమ్నీకమ్యూనికేషన్ వేదికను ఏర్పాటు చేసింది. భారత్‌లో ప్రస్తుతం క్లౌడ్ కమ్యూనికేషన్ మార్కెట్ వ్యాల్యూ ఒక బిలియన్ డాలర్లుగా ఉన్నది. ప్రతి ఏటా ఇరవై శాతం వృద్ధి సాధిస్తున్నది. ఈ రంగంలోకి అడుగు పెట్టిన మొదటి టెలికం ఆఫరేటర్ ఎయిర్‌టెల్. ఇప్పటికే ఎయిర్ ఐక్యూ సేవల కోసం స్విగ్గీ, జస్ట్ డయల్, అర్బన్ కంపెనీ, హావిల్స్, డాక్టర్ లాల్‌పత్ ల్యాబ్స్, రాపిడో సంతకాలు చేశాయి.

ఇవి ఎయిర్‌టెల్ ఐక్యూ బీటా వర్షన్‌ను ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం ఇది వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చింది. సేవలు ఉపయోగించుకున్నంత వరకే చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉంది. ప్రస్తుత మోడల్స్‌తో పోలిస్తే ఈ ప్లాట్‌ఫాం కంపెనీలకు దాదాపు నలభై శాతం ఖర్చు తగ్గిస్తుందని ఎయిర్టెల్అ ప్రతినిధి చెబుతున్నారు. తమ ఇన్‌సైడ్ ఇంజినీరింగ్ స్ట్రెంత్ ద్వారా ఎయిర్‌టెల్ ఐక్యూ వంటి ఎంటర్‌ప్రైజ్ ఉత్పత్తులు డెవలప్ చే స్తున్నది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.