శనివారం 30 మే 2020
National - May 20, 2020 , 02:08:59

బుకింగ్‌లు ఆరంభించిన విమాన సర్వీసు సంస్థలు

బుకింగ్‌లు ఆరంభించిన విమాన సర్వీసు సంస్థలు

ముంబై: లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన విమాన సర్వీసులు మళ్లీ ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు సిద్ధమవుతున్నాయి. వచ్చే నెల నుంచి సేవల పునరుద్ధరణకు పలు విమానయాన సంస్థలు ముందస్తు బుకింగ్‌లు ఆరంభించాయి. ఇండిగో, విస్తారాతోపాటు ఇతర సంస్థలు బుకింగ్‌లు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. పలు విమాన సంస్థలు బుకింగ్‌లు ఆరంభించబోతున్నాయని, ఇండిగో, స్పైస్‌జెట్‌, గో-ఎయిర్‌లు కూడా వచ్చే నెల 1 నుంచి అంతర్జాతీయ బుకింగ్‌లు ప్రారంభించబోతున్నాయని ఏపీఏఐ నేషనల్‌ ప్రెసిడెంట్‌ సుధాకర రెడ్డి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అయితే వచ్చే నెల 15 వరకు అంతర్జాతీయ బుకింగ్‌లు నిలిపివేసినట్లు స్పైస్‌జెట్‌ ప్రతినిధి వెల్లడించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌తో మార్చి 25 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.logo