గురువారం 03 డిసెంబర్ 2020
National - Oct 30, 2020 , 12:25:37

ఢిల్లీని క‌ప్పేసిన వాయు కాలుష్యం

ఢిల్లీని క‌ప్పేసిన వాయు కాలుష్యం

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో వాయు కాలుష్యం కోర‌లు చాస్తున్న‌ది. రోజురోజుకు ఢిల్లీలో వాయు నాణ్య‌త మ‌రింత అధ్వాన్నంగా మారుతున్న‌ది. ఇందిరాపురం ప్రాంతంలో గాలి నాణ్య‌త 384గా ఉన్న‌ద‌ని వాయు నాణ్య‌త సూచీ (ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ - AQI) సూచిస్తున్న‌ది. కేంద్ర కాలుష్య నియంత్ర‌ణ సంస్థ (సెంట్ర‌ల్ పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు - CPCB) ప్ర‌కారం ఇందిరాపురంలో వాయు నాణ్య‌త అత్యంత అధ్వాన్నంగా మారింది. అంతేగాక ఢిల్లీలోని ఇండియాగేట్‌, ఘ‌జియాబాద్ త‌దిత‌ర ప్రాంతాల్లోనూ వాయు కాలుష్యం దారుణంగా పెరిగింది.   ‌   

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.