బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 13:09:47

లోదుస్తుల్లో బంగారం స్మ‌గ్లింగ్‌.. ప‌ట్టుకున్న అధికారులు

లోదుస్తుల్లో బంగారం స్మ‌గ్లింగ్‌.. ప‌ట్టుకున్న అధికారులు

కొచ్చి: కేర‌ళ‌లో అక్ర‌మంగా బంగారం త‌ర‌లిస్తున్న ముగ్గురు వ్య‌క్తులు అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. కేర‌ళ‌లోని కోజికోడ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో అనుమానాస్ప‌దంగా త‌చ్చాడుతున్న ముగ్గురు వ్య‌క్తుల‌ను అక్క‌డి క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీ చేశారు. ఈ త‌నిఖీల్లో ఆ ముగ్గురి నుంచి భారీగా బంగారం ప‌ట్టుబ‌డింది. మొత్తం 1886 గ్రాముల బంగారాన్ని నిందితుల నుంచి సీజ్ చేసిన‌ట్లు అధికారులు తెలిపారు. నిందితులు ముగ్గిరిని అదుపులోకి తీసుకుని కేసులు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు. 

నిందితుల్లో ఇద్ద‌రు లోద‌స్తుల్లో బంగారం పెట్టుకుని త‌ర‌లించే య‌త్నం చేయ‌గా.. మ‌రో వ్య‌క్తి తాము త‌నిఖీ చేసేది గ‌మ‌నించి ఎయిర్‌పోర్టు ఫ్ల‌స్ ట్యాంకులో బంగారాన్ని ప‌డేసి వ‌చ్చాడ‌ని అధికారులు చెప్పారు. నిందితుల‌ను రిమాండ్‌కు త‌ర‌లించి ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని కొచ్చి క‌స్ట‌మ్స్ క‌మిష‌న‌రేట్ తెలిపింది.    ‌

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.