బుధవారం 30 సెప్టెంబర్ 2020
National - Sep 16, 2020 , 14:13:26

భారీగా ప‌ట్టుబ‌డ్డ విదేశీ క‌రెన్సీ

భారీగా ప‌ట్టుబ‌డ్డ విదేశీ క‌రెన్సీ

కొచ్చి: కేర‌ళ‌లో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. క‌న్నౌర్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ దాదాపు రూ.10.40 ల‌క్ష‌ల విలువ చేసే ఫారిన్ క‌రెన్సీని సీజ్ చేసింది. అందులో 12,500 అమెరికన్ డాల‌ర్లు, 4,210 యూఏఈ దీర‌మ్‌లు, 5,145 చైనా యువాన్‌లు ఉన్నాయి. కేర‌ళ నుంచి అబు దుబాయ్‌కి వెళ్తున్న ప్ర‌యాణికుడి నుంచి అధికారులు ఈ క‌రెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్టులోని సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్‌) స‌హ‌కారంతో తాము విదేశీ క‌రెన్సీని ప‌ట్టుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని కొచ్చి క‌స్ట‌మ్స్ క‌మిష‌న‌రేట్‌కు చెందిన అధికారులు తెలిపారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo