ఎయిరిండియా మహిళా పైలట్ల అరుదైన ఘనత

బెంగళూరు: భారతదేశ విమానయాన చరిత్రలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమయ్యింది. ఎయిరిండియాకు చెందిన నలుగురు మహిళా పైలట్లు అరుదైన ఘనత సాధించారు. అత్యంత సుదూర ప్రయాణం చేసి ప్రపంచానికి చెరో కొసన ఉన్న అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు విజయవంతంగా తిరిగివచ్చారు. ఉత్తర ధ్రువం మీదుగా 17 గంటల పాటు 16 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశారు. శాన్ఫ్రాన్సిస్కోలో (స్థానిక కాలమానం ప్రకారం) శనివారం ఉదయం 8.30 గంటలకు బయలుదేరి.. సోమవారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో విమానాన్ని ల్యాండ్ చేశారు. తమ ప్రయాణంలో ఎక్కడా ఆగకుండా వారు విమానాన్ని నడపడం విశేషం. ఈ విమానాన్ని నడిపినవారిలో కెప్టెన్ జోయా అగర్వాల్, కెప్టెన్ తన్మయి, కెప్టెన్ ఆకాంక్ష సోనావరె, కెప్టెన్ శివానీ మన్హాస్ ఉన్నారు. కెప్టెన్ తన్మయి మన తెలుగమ్మాయి కావడం విశేషం.
కాగా, తాము ఈరోజు చరిత్ర సృష్టించామని కెప్టెన్ జోయా అగర్వాల్ అన్నారు. కేవలం ఉత్తర ధ్రువం మీదుగా విమానాన్ని తీసుకురావడమే కాకుండా, విమానాన్ని అంతా మహిళా పైలట్లమే నడపడం ద్వారా ప్రంపచ రికార్డు నెలకొల్పామని చెప్పారు. ఈఘనతలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందని సంతోషం వ్యక్తంచేశారు. ఉత్తర ధ్రువం మార్గంలో రావడంవల్ల 10 టన్నుల ఇంధనాన్ని ఆదాచేశామని వెల్లడించారు.
ఇది గొప్ప అనుభవం అని, చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని కెప్టెన్ శివానీ మన్హాస్ అన్నారు. శాన్ఫ్రాన్సిస్కో నుంచి తాము ఇక్కడికి చేరుకోవడానికి 17 గంటలు పట్టిందని చెప్పారు.
తాజావార్తలు
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్
- జనం మెచ్చిన గళం గోరటి వెంకన్నది
- శెభాష్...సిరాజ్: మంత్రి కేటీఆర్
- త్వరలో కామన్ మొబిలిటీ కార్డు: హైద్రాబాదీలకు ఫుల్ జాయ్