మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 18:04:28

ఈ నెల 11 నుంచి భారత్, అమెరికా మధ్య విమాన సర్వీసులు

ఈ నెల 11 నుంచి భారత్, అమెరికా మధ్య విమాన సర్వీసులు

న్యూఢిల్లీ: ఈ నెల 11 నుంచి భారత్, అమెరికా మధ్య అంతర్జాతీయ విమానాలు ప్రయాణించనున్నాయి.  వందే భారత్ మిషన్‌లో భాగంగా ఈ నెల 11 నుంచి 19 వరకు 36 విమాన సర్వీసులను నడపనున్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. సంబంధిత విమాన ప్రయాణాల టికెట్లను సోమవారం నుంచి ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ ద్వారా మాత్రమే బుక్ చేసుకోవాలని పేర్కొంది. భారత కాలమానం ప్రకారం ఈ నెల 6వ తేదీ రాత్రి 8 గంటల నుంచి టికెట్ల బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనను ఎయిర్ ఇండియా విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో పలు దేశాల్లో విధించిన లాక్‌డౌన్ వల్ల విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాల ద్వారా భారత్‌కు తరలిస్తున్న సంగతి తెలిసిందే.

logo